అనంతపురం జిల్లా మడకశిర ప్రాంతంలో పీడీఎస్యూ నాయకులు ఆందోళన చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో బదిలీ ధ్రువీకరణ (టీసీ) పత్రానికి డబ్బులు వసూలు చేస్తున్న ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలని.. మండల విద్యాశాఖ అధికారికి వినతిపత్రం సమర్పించారు. ఉన్నత చదువులు కొరకు ఇతర పాఠశాలల్లో చేరేందుకు టీసీ అడిగితే.... ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రధానోపాధ్యాయులు 100 నుంచి 400 రూపాయల వరకు డబ్బులు వసూలు చేస్తున్నారని విద్యార్థి నాయకులు అన్నారు. వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని అర్జీలో పేర్కొన్నారు.
'డబ్బులు వసూలు చేస్తున్న ఉపాధ్యాయులుపై చర్యలు తీసుకోవాలి' - మడకశిర తాజా వార్తలు
బదిలీ ధ్రువీకరణ పత్రాలపై డబ్బులు వసూలు చేస్తున్న ఉపాధ్యాయులుపై చర్యలు తీసుకోవాలని విద్యార్థిసంఘ నాయకులు డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా మడకశిర ప్రాంతంలో పీడీఎస్యూ అధికారులు ధర్నా చేశారు.
మడకశిరలో పీడీఎస్యూ నాయకులు ఆందోళన