అనంతపురం జిల్లా గుత్తి మండలంలోని కొత్తపేట, ఈసురాళ్లపల్లి గ్రామాల్లో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో అక్రమంగా తరలిస్తున్న 2టన్నుల 50 కేజీల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకుని ఆటోను సీజ్ చేసినట్లు గుత్తి సీఐ రాము తెలిపారు. ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు.
పెద్దవడుగూరు మండలం మిడుతూరు గ్రామ సమీపంలోని 44వ జాతీయ రహదారి పక్కన అక్రమంగా రేషన్ బియ్యం నిల్వ ఉంచిన ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 24 బియ్యం బస్తాలను సీజ్ చేసుకున్నట్లు తెలిపారు. ఎవరైనా రేషన్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ ఉంచినా, తరలించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.