ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

68 బస్తాల ప్రభుత్వ చౌక బియ్యం పట్టివేత - ఉరవకొండ తాజా వార్తలు

పేదలకు అందాల్సిన ప్రభుత్వ బియ్యం పక్కదారి పడుతోంది. ప్రభుత్వం అందజేసే బియ్యం కొంత మంది అక్రమార్కులు నిల్వ ఉంచుకొని అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఉరవకొండలో రెండు చోట్లా అక్రమంగా నిల్వ ఉంచిన 68 బస్తాలు చౌక బియ్యాన్ని రెవెన్యూ సిబ్బంది, పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి స్వాధీనం చేసుకున్నారు.

pds rice caught in some people houses by revenue and police departments in uravakonda
అక్రమార్కుల నుంచి పీడీఎస్​​ బస్తాలు పట్టుకున్నరెవెన్యు, పోలీసు సిప్బంది

By

Published : May 15, 2020, 4:17 PM IST

అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలోని సీవీవీ నగర్​లో లక్ష్మీదేవి అనే మహిళ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 51 బస్తాలు, సాయిబాబు నగర్​లో హనుమంతు అనే వ్యక్తి ఇంట్లో 17 బస్తాల ప్రభుత్వ చౌక బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీరిద్దరు కలిపి 68 బస్తాల చౌక బియ్యాన్ని వారి ఇళ్లల్లో ఉంచుకున్నారు. వీరిపై కేసు నమోదు చేశామని ఎస్సై ధరణి బాబు తెలిపారు. బియ్యం బస్తాలు స్టాక్ పాయింట్​కు తరలిస్తున్నట్లు ఉరవకొండ ఎమ్మార్వో వాణిశ్రీ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details