ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భాజపా, ఆర్ఎస్ఎస్ బాటలో జగన్ నడుస్తున్నారు: శైలజానాథ్ - పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్

భాజపా, ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి జగన్ నడుస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ ఆరోపించారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒక్క అభివృద్ధి పని చేయలేదని మండిపడ్డారు.

pcc sailajanath
pcc sailajanath

By

Published : Apr 6, 2021, 6:38 PM IST

సీఎం జగన్... కావాలనే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహణకు యత్నిస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ అన్నారు. ఎన్నికల్లో ప్రజలకు నీటి ట్యాక్స్​లు, ఇంటి పనులు వేస్తున్నామని చెప్పి వైకాపా ఓట్లు అడగాల్సిందని ఎద్దేవా చేశారు. భాజపా, ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో జగన్ నడుస్తున్నారని ఆరోపించారు.

వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒక్క అభివృద్ధి పనులు కూడా చేయలేదని మండిపడ్డారు. వైకాపాకు ధైర్యం ఉంటే కొత్త ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వాలని అడగాలన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమని కాపాడలేని పరిస్థితిలో అధికార పార్టీ ఉందని విమర్శించారు.

ABOUT THE AUTHOR

...view details