దేశంలోని ప్రజల బాగోగుల గురించి కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఆలోచిస్తుందని... పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ అన్నారు. ఆదివారం అనంతపురం జిల్లాలో పర్యటించిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రం అభివృద్ధి ఒక్క కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ప్రజలు చూశారని పేర్కొన్నారు. బడ్జెట్ కేటాయింపులోనూ రాష్ట్రానికి అన్యాయం చేశారని... దీనిపై ముఖ్యమంత్రి జగన్, పవన్ స్పందించాలన్నారు. దేశంలోనూ రాష్ట్రంలోనూ అసమర్థ పాలన చేస్తున్నారని విమర్శించారు.
'బడ్జెట్ కేటాయింపులపై వారు స్పందించాలి' - pcc president sailajanath visited ananthapur
అనంతపురం జిల్లాలో ఆదివారం పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ పర్యటించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించారు.
'బడ్జెట్ కేటాయింపులపై పవన్, ముఖ్యమంత్రి స్పందించాలి'