ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'రాష్ట్రాలకు కనీసం రూ.10 వేల కోట్లు కేటాయించాలి' - కరోనా వార్తలు

చప్పట్లు కొడితే కరోనా వైరస్ పోదని పీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు శైలజానాథ్ ఎద్దేవా చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అనంతపురంలోని ప్రభుత్వాసుపత్రిని ఆయన పరిశీలించారు.

Pcc  President  Sailajanath  Visits at  anantapur governement Hospital
అనంతపురం ప్రభుత్వాసుపత్రిని సందర్శించిన శైలజానాథ్

By

Published : Mar 21, 2020, 4:12 PM IST

అనంతపురం ప్రభుత్వాసుపత్రిని సందర్శించిన శైలజానాథ్

కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు తగినన్ని నిధులు కేటాయించి వైద్య సదుపాయాలు కల్పించాలని... పీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు శైలజానాథ్ డిమాండ్ చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అనంతపురంలోని ప్రభుత్వాసుపత్రిని ఆయన పరిశీలించారు. కరోనా అనుమానితులు వస్తే వారికి పరీక్షలు, ఇతర సౌకర్యాలు కల్పించే పరిస్థితి ఉందా లేదా అని వైద్యులనడిగి తెలుసుకున్నారు. విధులు నిర్వహిస్తున్న వైద్యులు, ఇతర సిబ్బందికి అవసరమైన సదుపాయాలు, పరికరాలు అందజేయాలని కోరారు. రాష్ట్రాలకు కేంద్రం కనీసం రూ.10వేల కోట్లు కేటాయించాలని శైలజానాథ్ డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details