ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నీలకంఠాపురంలో ఘనంగా శ్రీ సీతారాముల కల్యాణోత్సవం - మాజీ పీసీసీ అధ్యక్షుడు రఘవీరారెడ్డి తాజావార్తలు

అనంతపురం జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురం గ్రామంలో మాజీ పీసీసీ అధ్యక్షుడు రఘవీరారెడ్డి ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కల్యాణోత్సవం నిర్వహించారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా అతి తక్కువ మందితో శాస్త్రోక్తంగా.. కార్యక్రమం జరిపించారు.

seetharaamula kalyanostavam
నీలకంఠాపురంలో శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం

By

Published : Apr 22, 2021, 9:01 PM IST

అనంతపురం జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురంలో మాజీ పీసీసీ అధ్యక్షుడు, రఘువీరారెడ్డి దంపతులు శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం జరిపించారు. నలభై సంవత్సరాలుగా శ్రీరామ నవమి రోజున 30 నుంచి 50 నిరుపేద వధూవరులకు బట్టలు, తాళి బొట్టు ఇచ్చి ఉచిత సామూహిక వివాహాలు నిర్వహించారు. కరోనా కారణంగా ఈ సారి సామూహిక పెళ్లిళ్లు రద్దయ్యాయి. కొన్నేళ్లుగా ఆనవాయితీగా వస్తున్న కార్యక్రమం ఆగిపోవటంతో రఘువీరారెడ్డి దంపతులు బాధను వ్యక్త పరిచారు. కొవిడ్​ వ్యాప్తి దృష్ట్యా పరిమిత భక్తులతో సీతారాముల కల్యాణం నిర్వహించారు.

ABOUT THE AUTHOR

...view details