అనంతపురం జిల్లాలో వరదల వల్ల కలిగిన నష్టంపై.. జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి బొత్స సత్యనారాయణ సమీక్ష నిర్వహించారు. అనంతపురం కలెక్టర్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో జిల్లా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరై వరద నష్టంపై చర్చించారు. జిల్లాలో నష్ట వివరాలను అధికారులు మంత్రికి వివరించగా.. ఆ సమాచారంపై (Payyavula keshav On Crop Damage In Anantapur district) ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ-క్రాప్ విధానం అమలులో లోపాలున్నాయని.. మంత్రి బొత్స సత్యనారాయణ దృష్టికి తీసుకొచ్చారు.
జిల్లా అధికారులు ఈ-క్రాప్ విధానంలో తప్పుడు సమాచారాన్ని అందిస్తున్నారన్నారు. జిల్లాలో వంద శాతం పంటలు నష్టపోతే.. 50 శాతమే చూపుతున్నారని.. ఒక్క శాతం కూడా ఈ-క్రాప్ చేయలేదని పయ్యావుల అన్నారు. ఈ అంశాలపై దృష్టి సారించి..రైతులకు న్యాయం చేయాలని మంత్రి బొత్స సత్యనారాయణను కోరారు.