అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో భారీ వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ అందించాలని తెదేపా నేత పయ్యావుల కేశవ్ డిమాండ్ చేశారు. ఉరవకొండలోని వ్యవసాయ కార్యాలయానికి రైతులతో కలిసి పయ్యావుల కేశవ్ వెళ్లారు. రైతులకు పంట నష్టం అందేలా చూడాలని అధికారులను కోరారు. ఇన్సూరెన్స్ జాబితాలో లేని రైతులకు కూడా ఇన్పుట్ సబ్సిడీ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలా చేయని పక్షంలో తెలుగుదేశం పార్టీ ఆందోళన చేపడుతుందని పయ్యావుల కేశవ్ అన్నారు.
'నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలి' - payyavula kesav on input subsidy to farmers
అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలో వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి ఆదుకోవాలని తెదేపా నేత పయ్యావుల కేశవ్ కోరారు. ఇన్సూరెన్స్ జాబితాలో లేని రైతులకు కూడా ఇన్పుట్ సబ్సిడీ విడుదల చేయాలన్నారు.
ఉరవకొండ వ్యవసాయ కార్యాలయంలో పయ్యావుల కేశవ్