కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగి ఆత్మహత్య చేసుకున్నాడు. భవనం పైనుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. అనంతపురం జిల్లా కలగల్లు గ్రామానికి చెందిన కోటయ్య డయాలసిస్ చికిత్స పొందుతూన్నాడు. యురాలజీ విభాగంలో ఉన్న కోటయ్య ఉదయం భార్య, కుమారుడ్ని టీ తీసుకుని రమ్మని చెప్పి ఆసుపత్రి భవనం నుంచి దూకాడు. అత్యవసర విభాగానికి తీసుకెళ్లి పరీక్షించిన వైద్యులు.. మృతి చెందినట్లు నిర్ధరించారు.
Suicide: ఆసుపత్రి భవనం పైనుంచి దూకి.. రోగి ఆత్మహత్య - ప్రభుత్వాసుపత్రి పైనుంచి దూకి ఆత్మహత్య
ఏమైందో ఏమో తెలియదు కానీ.. ఓ రోగి ఆసుపత్రి భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కర్నూలు జిల్లాలో జరిగింది.
PATIENT COMMITS SUICIDE BY JUMPING FROM GOVT HOSPITAL KARNULU