ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అనంతపురంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారాల జోరు - Municipal elections in Madakashir

రాయలసీమలోనూ చివరిరోజు ప్రచారం హోరెత్తింది. అనంతపురం జిల్లా రాయదుర్గంలో మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు ఇంటింటికి తిరిగి ఓట్లు అభ్యర్థించారు. అనంతపురంలో వైకాపా అభ్యర్థులు ప్రచారంలో పాల్గొన్నారు. మడకశిరలో ఇరుపార్టీలకు చెందిన కీలక నేతలు ప్రచారంతో హోరెత్తించారు.

అనంతపురంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారాల జోరు
అనంతపురంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారాల జోరు

By

Published : Mar 8, 2021, 5:01 PM IST

రాయదుర్గంలో కాలవ తెలుగుదేశం పార్టీ ప్రచారం

అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని 3, 5, 12, 18 వార్డులలో మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులతో కలిసి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. రాయదుర్గం తెలుగుదేశం పార్టీ మున్సిపల్ ఎన్నికల పరిశీలకులు ఆలం నరసనాయుడు, తెదేపా నాయకులు, కార్యకర్తలతో కలిసి మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ గుర్తు సైకిల్ కు ఓటు వేసి మున్సిపల్ ఎన్నికల్లో గెలిపించాలని కాలవ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

అనంతపురంలో వైకాపా చేసిన అభివృద్దే తమను గెలిపిస్తుందని మూడవ డివిజన్ వైకాపా అభ్యర్థి కుమారమ్మ ధీమా వ్యక్తం చేశారు. మాజీ కార్పొరేటర్ గిరిజతో కలిసి ఆమె ఇంటి ఇంటికి ప్రచారం నిర్వహించారు. రెండు ఏళ్ళ పాలనలో ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజలు గమనించాలని ఆమె ప్రచారంలో నవరత్నాలు సంక్షేమ పథకాలను వివరిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే సైతం నగర అభివృద్ధికి కట్టుబడి ఉన్నారని ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వేయించి గెలిపించాలని కోరారు.

మడకశిర పట్టణంలోని 20 వార్డుల్లో ముఖ్య నాయకులు అభ్యర్థులతో కలిసి హోరాహోరీగా ప్రచారాలు నిర్వహిస్తున్నారు. ప్రతి వార్డులో బరిలో ఉన్న అభ్యర్థులు తమతమ మద్దతుదారులను పెద్ద సంఖ్యలో కూడగట్టుకొని ఇంటింటా ఓట్లు అడుగుతున్నారు. తమ అభ్యర్థుల గెలుపు కోసం వార్డులలో విసృతంగా ప్రచారం చేస్తున్నారు. తెదేపా పార్టి అభ్యర్థుల తరుపున ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, వైకాపా అభ్యర్థుల తరుపున ఎమ్మెల్యే మోపురుగుండు తిప్పేస్వామి ప్రచారాలు నిర్వహిస్తున్నారు.

ఇవీ చదవండి

వైకాపాకు ఓటమి భయం పట్టుకుంది: పరిటాల శ్రీరామ్

ABOUT THE AUTHOR

...view details