ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రామగిరిలో పరిటాల సునీత ట్రాక్టర్​ ర్యాలీ.. వైకాపాపై విమర్శలు - latest news in anantapur

Sunitha Tractor Rally: వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతులను తీవ్ర సంక్షోభంలోకి నెట్టేసిందని తెదేపా మాజీ మంత్రి పరిటాల సునీత ఆరోపించారు. రాయితీ పరికరాలు, డ్రిప్ ఇరిగేషన్ సౌకర్యాలు కల్పించకుండా రైతులను ఇబ్బందులకు గురి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా రామగిరిలో రైతులతో కలిసి ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు.

Sunitha Tractor Rally
రామగిరిలో పరిటాల సునీత ట్రాక్టర్​ ర్యాలీ

By

Published : Mar 14, 2022, 9:08 PM IST

Sunitha Tractor Rally: ముఖ్యమంత్రి జగన్ తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చి రైతులను మోసం చేశారని తెదేపా మాజీ మంత్రి పరిటాల సునీత ఆరోపించారు. అనంతపురం జిల్లా రామగిరిలో రైతులతో కలిసి ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. రామగిరి తహశీల్దార్ కార్యాలయం వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతులను తీవ్ర సంక్షోభంలోకి వెళ్లేలా చేశారన్నారు. రాయితీ పరికరాలు, డ్రిప్ ఇరిగేషన్ సౌకర్యాలు కల్పించకుండా రైతులను ఇబ్బందులకు గురి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రామగిరిలో పరిటాల సునీత ట్రాక్టర్​ ర్యాలీ

రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. వైకాపా నాయకులు గొప్పలు చెప్పుకోవడం తప్పా చేసిందేమీ లేదన్నారు. తెదేపా అధికారంలోనే రైతులు అన్ని విధాల అభివృద్ధి చెందారన్నారు. ప్రాజెక్టులు పూర్తి చేయకుండా రైతులను ఇబ్బందులకు గురి చేశారని విమర్శించారు. రైతులను మోసం చేసిన పార్టీగా వైకాపా చరిత్రలో నిలిచిపోతుందని ఎద్దేవా చేశారు.

స్థానిక ప్రజాప్రతినిధులు సైతం రైతుల సమస్యలు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ అధికారులు రాజకీయ ఒత్తిళ్లతో రైతులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. రైతు పక్షపాతి అని చెప్పుకునే ప్రభుత్వం మూడేళ్ళ పాలనలో రైతులకు ఏం చేశారో చెప్పాలన్నారు. త్వరలో ఈ ప్రభుత్వానికి ప్రజలు, రైతులు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

ఇదీ చదవండి: 'ఆర్​ఆర్​ఆర్'​కు ఏం చేయాలో అది చేస్తానని సీఎం జగన్ హామీ ఇచ్చారు: రాజమౌళి

ABOUT THE AUTHOR

...view details