ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మండలిలో మంత్రుల తీరు దుర్మార్గం: పరిటాల సునీత

దేవాలయం లాంటి చట్ట సభలను మంత్రులు అవమానిస్తున్నారని మాజీ మంత్రి, తెదేపా నేత పరిటాల సునీత ఆరోపించారు. దివంగత నేత పరిటాల రవి వర్థంతి సందర్భంగా ఆయన సమాధి వద్ద పరిటాల సునీత కుటుంబ సమేతంగా నివాళులర్పించారు. మండలి ఛైర్మన్​తో మంత్రులు వ్యవహరించిన తీరును ఆమె తప్పుబట్టారు. అమరావతి రైతుల ఆందోళనపై ప్రభుత్వం స్పందించకపోవడం సరికాదని సునీత అన్నారు. ఎమ్మెల్సీ పోతుల సునీత పార్టీ మారడంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు.

paritala sunita
పరిటాల సునీత

By

Published : Jan 24, 2020, 6:12 PM IST

మీడియాతో పరిటాల సునీత
అసెంబ్లీ, మండలిలో మంత్రుల తీరు దుర్మార్గంగా ఉందని మాజీ మంత్రి పరిటాల సునీత అన్నారు. మండలి ఛైర్మన్ స్థానానికి గౌరవం ఇవ్వకుండా మంత్రులు ప్రవర్తిస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. దివంగత నేత పరిటాల రవి వర్థంతి సందర్భంగా సునీత కుటుంబ సభ్యులతో కలిసి అనంతపురం జిల్లా రాప్తాడులోని రవి సమాధి వద్ద నివాళులు అర్పించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.

దేవాలయం లాంటి అసెంబ్లీలో అధికారపార్టీ నేతలు వ్యవహరిస్తున్న తీరు చాలా బాధాకరంగా ఉందన్నారు. అమరావతి కోసం రైతులు ఆందోళనలు చేస్తున్నా.. ప్రభుత్వం పట్టించుకోకపోవడం సరికాదన్నారు. మహిళా రైతులపై జరుగుతున్న దాడులు.. సమాజం తలదించుకునేలా ఉన్నాయని ఆవేదన చెందారు. పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో ఎమ్మెల్సీ పోతుల సునీత పార్టీ వీడటంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. పరిటాల రవి మరణం తర్వాత తమతోపాటు పోతుల సురేష్ కుటుంబానికి తెదేపా అధినేత చంద్రబాబు అండగా నిలిచారని.. అవన్నీ మరచి పార్టీ మారటం వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని సునీత వ్యాఖ్యానించారు.

ABOUT THE AUTHOR

...view details