డ్వాక్రా సంఘాలకు తెదేపా ప్రభుత్వం 21వేల కోట్లు ఇస్తే... వైకాపా ప్రభుత్వం ఇచ్చింది కేవలం 1400 కోట్లు మాత్రమేనని మాజీ మంత్రి పరిటాల సునీత అన్నారు. ఐదు లక్షల వరకూ వర్తించే.. సున్నా వడ్డీ పరిమితిని, మూడు లక్షలకు కుదించటం మోసమని దుయ్యబట్టారు. డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ రుణాలను సీఎం జగన్ కొత్తగా ప్రవేశపెట్టినట్లు ప్రచారం చేసుకోవడం మోసమని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2012లో మాజీ ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి సున్నా వడ్డీ రుణాలను ప్రారంభిస్తే.. దానిని చంద్రబాబు పెద్ద ఎత్తున అమలు చేశారని గుర్తు చేశారు.
'సున్నా వడ్డీ రుణాలు కొత్తగా ప్రవేశపెట్టినట్టు ప్రచారం చేస్తున్నారు'
సున్నా వడ్డీ రుణాలను సీఎం జగన్ కొత్తగా ప్రవేశపెట్టినట్లు ప్రచారం చేసుకుంటున్నారని మాజీ మంత్రి పరిటాల సునీత విమర్శించారు. డ్వాక్రా సంఘాలకు తెదేపా ప్రభుత్వం 21వేల కోట్లు ఇస్తే... వైకాపా ప్రభుత్వం ఇచ్చింది కేవలం 1400 కోట్లు మాత్రమేనని పరిటాల సునీత అన్నారు.
సున్నా వడ్డీ రుణాలపై పరిటాల సునీత