ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 4, 2021, 10:26 PM IST

ETV Bharat / state

Paritala: రైతు కష్టాలు ప్రభుత్వానికి పట్టడం లేదు: పరిటాల సునీత

సకాలంలో వర్షాలు కురవక రైతులు తీవ్రంగా నష్టపోయినా ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరిస్తుందని మాజీ మంత్రి పరిటాల సునీత మండిపడ్డారు. అనంతపురం జిల్లా రామగిరి మండలంలో ఎండిపోయిన వేరుశనగ పంటను పరిశీలించిన ఆమె..నష్టపోయిన ప్రతి రైతుకు ఇన్​పుట్ రాయితీ సొమ్ము విడుదల చేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

రైతు కష్టాలు ప్రభుత్వానికి పట్టడం లేదు
రైతు కష్టాలు ప్రభుత్వానికి పట్టడం లేదు

అనంతపురం జిల్లా రామగిరి మండలంలో ఎండిపోయిన వేరుశనగ పంటను మాజీ మంత్రి పరిటాల సునీత, మాజీ ఎమ్మెల్యే పార్థసారథి, మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామిలు పరిశీలించి రైతులకు ధైర్యం చెప్పారు. వర్షాలు లేక రైతులు అల్లాడిపోతున్నా..ప్రభుత్వానికి పట్టడం లేదని పరిటాల సునీత మండిపడ్డారు. ఈసారి ఖరీఫ్​లో ఏ పంట రైతులకు చేతికొచ్చే పరిస్థితి లేదన్నారు. దాదాపు 50 రోజులుగా చినుకు పడకపోవడం వల్ల..రైతుల పెట్టుబడి పూర్తిగా మట్టిలో కలిసిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

జిల్లావ్యాప్తంగా వేరుశనగ పంట పూర్తిగా ఎండిపోయిందని వాపోయారు. రైతులు తీవ్రంగా నష్టపోయినా ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరిస్తుందని.. కనీసం రైతు పొలాలను సందర్శించి ధైర్యం కూడా చెప్పటం లేదని మండిపడ్డారు. ఇప్పటికైనా నష్టపోయిన ప్రతి రైతుకు ఇన్​పుట్ రాయితీ సొమ్ము విడుదల చేసి.. ఆదుకోవాలని సునీత డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details