వైకాపా నేతలు తెలుగుదేశం కార్యకర్తలే లక్ష్యంగా దాడులకు పాల్పడుతున్నారని ఆ పార్టీ నేత పరిటాల శ్రీరామ్ ఆరోపించారు. అనంతపురం జిల్లా కనగానపల్లి మండలం మద్దెలచెరువు గ్రామంలో కొందరు వైకాపా నేతలు... తెదేపా కార్యకర్త రామాంజనేయులపై దాడి చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతన్ని పరిటాల శ్రీరామ్ పరామర్శించారు. వైకాపా చర్యలకు కచ్చితంగా ప్రతిచర్య ఉంటుందని హెచ్చరించారు.
వైకాపా చర్యలకు ప్రతిచర్య ఉంటుంది: పరిటాల శ్రీరామ్ - అనంతపురం జిల్లాలో తెదేపా కార్యకర్తపై దాడి న్యూస్
వైకాపా నేతలపై తెదేపా నేత పరిటాల శ్రీరామ్ విమర్శలు గుప్పించారు. తమ పార్టీ కార్యకర్తలపై దాడులు చేయడం సరికాదని పేర్కొన్నారు.
paritala sriram Visitation tdp activist