ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'మాస్కులు ఏవని ప్రశ్నించే సిబ్బందికే మాస్కులు లేవు'

By

Published : Mar 28, 2021, 9:29 PM IST

తమ పిల్లలతో మాట్లాడేందుకు ఎంతో దూరం నుంచి వస్తే గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ అడ్డుకుంటున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ ఘటన అనంతపురం జిల్లా తిమ్మాపురం బాలయోగి గురుకుల పాఠశాలలో జరిగింది.

parents-protest-with-not-allowing-in-gurukula-school-at-thimmapuram-ananthapuram-district
అనంతపురం జిల్లా తిమ్మాపురం బాలయోగి గురుకుల పాఠశాల ఎదుట తల్లిదండ్రుల ధర్నా

అనంతపురం జిల్లా కంబదూరు మండలం తిమ్మాపురం గ్రామంలోని బాలయోగి గురుకుల పాఠశాలలో ప్రతి ఆదివారం పిల్లల్ని కలిసేందుకు తల్లిదండ్రులకు అనుమతిస్తారు. ఈ క్రమంలో ఈ ఆదివారం ముందస్తు సమాచారం ఇవ్వకుండా విద్యార్థుల తల్లిదండ్రులను అడ్డుకున్నారు. ఈ ఘటనతో ఆగ్రహం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు పాఠశాల ప్రిన్సిపల్ వైఖరిని తప్పుబట్టారు. కొంతమందిని పాఠశాలలోకి అనుమతించి, మరికొందరిని బయటే ఉంచడం ఏమిటని ప్రశ్నించారు. మాస్కులు లేవని అడ్డుకోవడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. మాస్కులు వేసుకోవాలని చెప్పిన సిబ్బందికే మాస్కులు లేవని విద్యార్థుల తల్లిదండ్రులు నిలదీశారు.

ABOUT THE AUTHOR

...view details