ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

DANGER JOURNEY: కారు డిక్కీలో కూర్చుని ప్రయాణం..ప్రాణాలతో చెలగాటం - ఉరవకొండలో ప్రమాదకరంగా ప్రయాణిస్తున్న చిన్నారులు

పిల్లల సంతోషం కోసం తల్లిదండ్రులు ఏం చేయటానికైనా సిద్ధపడతారు. ఒక్కోసారి వారి అతి ప్రేమే చిన్నారుల ప్రాణాల మీదకు తెస్తుంది. తాజాగా ఓ కుటుంబం కారులో వెళ్తుండగా.. వారి పిల్లలు వెనుక ఉన్న డిక్కీలో కూర్చొని.. మొబైల్ ఫోన్​లో గేములు ఆడుతూ కనిపించారు. తల్లిదండ్రుల తీరుపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

childrens
డిక్కీలో కూర్చొని మొబైల్ ఫోన్​లో గేమ్స్

By

Published : Aug 11, 2021, 7:04 PM IST

Updated : Aug 11, 2021, 7:45 PM IST

మారాం చేశారని అడిగినంత సొమ్ము ఇవ్వటం, వాహనాలు నడుపుతున్నా ప్రోత్సహించటం.. ఇలా పిల్లలు అడగటమే ఆలస్యం.. ఏ మాత్రం ఆలోచించకుండా ఇస్తారు. వీటి కారణంగా చిన్నతనంలో వ్యవసనాలకు బానిసలవ్వటం, ప్రమాదాల బారిన పడటం జరుగుతోంది.

కారు డిక్కీలో కూర్చొని ప్రయాణిస్తున్న చిన్నారులు

తాజాగా అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణ సమీపంలోని అనంతపురం-బళ్లారి జాతీయ రహదారిపై ఓ కారులో కుటుంబ సభ్యులు వెళ్తుండగా ఇద్దరు పిల్లలు కారు వెనకాల ఉన్న డిక్కీలో కూర్చొని మొబైల్ ఫోన్​లో గేములు ఆడుతూ కనిపించారు. ఆ వాహనం వెనుక వస్తున్న ఓ చోదకుడు ఈ దృశ్యాలను తన చరవాణిలో బంధించాడు. వీడియో తీసినంత సేపు ఏం అవుతుందిలే అన్నట్టు ఉన్నారా చిన్నారులు. చిన్న పొరపాటు జరిగినా ఇద్దరి ప్రాణాలకు ముప్పు అని తెలిసి కూడా వారి తల్లిదండ్రులు అలా చేయటాన్ని పలువురు విమర్మిస్తున్నారు.

ఇదీ చదవండీ..ATM FRAUDS: డబ్బు డ్రా చేసినా.. ఖాతాలో సొమ్ము భద్రం

Last Updated : Aug 11, 2021, 7:45 PM IST

ABOUT THE AUTHOR

...view details