ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

RAPTADU TEMPLE : ఆలయానికి ఆదాయం ఉన్నా.. అభివృద్ధి సున్నా - ananthapuram district

అనంతపురం జిల్లా రాప్తాడులోని పండమేటి రాయుడు స్వామి.. భక్తుల ఆరాధ్య దైవం. నిత్యం ఈ ఆలయానికి స్థానికులే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తారు. ఈ ఆలయ అభివృద్ధిని మాత్రం ప్రభుత్వం విస్మరించిందని రాప్తాడు గ్రామస్తులు చెబుతున్నారు. ఆలయానికి సంబంధించి విలువైన భూములు ఉన్నా.. స్వామి వారి దీప, ధూప నైవేద్యాలకు కూడా దాతలపై ఆధారపడాల్సి వస్తోందని పేర్కొంటున్నారు.

రాప్తాడులోని పండమేటి రాయుడు స్వామి
రాప్తాడులోని పండమేటి రాయుడు స్వామి

By

Published : Dec 26, 2021, 6:17 PM IST

రాప్తాడు సమీపంలోని పండమేరు నది ఒడ్డున పండమేటి రాయుడు స్వామి ఆలయం ఉంది. ఈ ఆలయానికి సంబంధించి వందల కోట్లు విలువైన భూములు ఉన్నా.. ఆలయం మాత్రం అభివృద్ధికి నోచుకోలేదు. దేవాదాయశాఖకు చెందిన ఈ భూమిని 20 ఏళ్లపాటు ఏపీఐఐసీకి లీజుకు ఇచ్చారు. మూడేళ్లకోసారి పది శాతం లీజ్‌ ధర పెంచాలని ఒప్పందం చేసుకున్నారు. దీని ద్వారా ఏటా 4 నుంచి 5 లక్షల రూపాయల ఆదాయం సమకూరుతోంది. కానీ పర్వదినాల్లో పూజల నిర్వహణకూ ఆలయానికి డబ్బులు అందటం లేదు.

రాప్తాడులోని పండమేటి రాయుడు స్వామి

అనంతపురం నగరానికి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయం నది పక్కనే ఉన్నందున పర్యాటక కేంద్రంగా కూడా అభివృద్ధి చేసే అవకాశం ఉంది. గత ప్రభుత్వ హయాంలో జాతీయ రహదారికి అనుసంధానం చేస్తూ... సీసీ రోడ్లు వేసి, ఆలయం వద్ద ఉద్యానవనం ఏర్పాటు చేశారు. అధికారుల నిర్లక్ష్యంతో ఈ ఉద్యానవనం ప్రస్తుతం ముళ్లపొదలతో నిండిపోయింది. గ్రామస్తులే ముందుకు వచ్చి కోనేరు అభివృద్ధి చేసినా... అధికారులు దాని నిర్వహణ గాలికొదిలేశారు. ఆలయానికి సున్నం వేయటానికి కూడా దాతల సాయం కోరుతున్నామని గ్రామస్తులు చెబుతున్నారు. ఈ ఆలయ పూజారికి వేతనం ఇవ్వటం కూడా కష్టంగా మారిందని ధర్మకర్తల మండలి సభ్యుడు పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details