జీవో నెం.2ను ఉపసంహరించుకోవాలంటూ అనంతపురం జిల్లా కదిరిలో పంచాయతీ కార్యదర్శులు నిరసన వ్యక్తం చేశారు. 73, 74 రాజ్యాంగ సవరణ ప్రకారం.. పంచాయతీరాజ్ పరిధిలోని 29 అంశాలు కార్యదర్శుల పరిధిలో ఉంటాయని స్పష్టం చేశారు. వీటిని రెవెన్యూశాఖకు చెందిన వీఆర్వోలకు ఎలా బదలాయిస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోని పక్షంలో ఆందోళనలు మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
వీఆర్వోల హర్షం:
డీడీఓ బాధ్యతలను తమకు అప్పగించడం పట్ల వీఆర్వోల సంఘంహర్షం వ్యక్తం చేసింది. ప్రభుత్వం తమకు అప్పగించిన విధులను అంకితభావంతో నెరవేరుస్తామని సభ్యులు పేర్కొన్నారు.