ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అనంతపురంలో పోటాపోటీగా నామినేషన్లు దాఖలు - palle raghunath reddy latest news

అనంతపురం జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో అధికార, ప్రతిపక్షాల నేతలు పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. చివరి రోజున ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి.. అభ్యర్థులతో నామినేషన్లు వేయించారు.

panchayati election nominations in Anantapur
అనంతపురంలో పోటాపోటీగా నామినేషన్లు దాఖలు

By

Published : Jan 31, 2021, 6:01 PM IST

అనంతపురం జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో వైకాపా, తెదేపా మద్దతుదారులు పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. చివరిరోజైన నేడు వైకాపా ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి, తెదేపా మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి... అభ్యర్థులతో నామినేషన్లు దాఖలు చేయించారు. 80 పంచాయతీల్లోనూ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. అధికార పార్టీకి ధీటుగా ప్రతిపక్ష పార్టీ నేతలు నామినేషన్లు వేశారు.

నామినేషన్ల కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి కొత్తచెరువు, నల్లమడ మండల కేంద్రాల్లో అభ్యర్థుల నామినేషన్లు దాఖలు చేయించగా.. మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి పుట్టపర్తి మండలంలో సర్పంచ్ నామినేషన్లు వేయించారు. అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు అత్యధిక స్థానాలను కైవసం చేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు సాగించారు.

ఇదీ చదవండి

అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తున్న ప్రధాన పార్టీలు

ABOUT THE AUTHOR

...view details