ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బాధ్యతల బదలాయింపుపై పంచాయతీ కార్యదర్శుల నిరసన - బాధ్యతల బదలాయింపుపై పంచాయతీ కార్యదర్శుల నిరసన

గ్రామ పంచాయతీ కార్యదర్శుల నుంచి డీడీఓ బాధ్యతలను వీఆర్వోలకు బదలాయించాలన్న ఆలోచనను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని పంచాయితీ సర్పంచులు డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా తనకల్లు మండల పరిషత్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు.

panchayathi sectretary protest
తనకల్లు మండల పరిషత్ కార్యాలయం ఎదుట ఆందోళన

By

Published : Mar 28, 2021, 12:07 PM IST

గ్రామ సచివాలయ ఉద్యోగులకు సంబంధించిన డ్రాయింగ్‌ డిస్‌బర్స్​మెంట్‌ అధికారి (డీడీవో) బాధ్యతలను పంచాయతీ కార్యదర్శుల నుంచి వీర్వోలకు ప్రభుత్వం బదిలీ చేయడంపై పంచాయతీ కార్యదర్శులు నిరసన వ్యక్తం చేశారు.

అనంతపురం జిల్లా తనకల్లు మండల పరిషత్ కార్యాలయం ఎదుట కొత్తగా ఎన్నికైన గ్రామ పంచాయితీ సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు నిరసన ప్రదర్శన చేపట్టారు. ప్రభుత్వం కొత్త గా తీసుకొచ్చిన జీవో నెంబర్ 2 ను ఉపసంహరించుకోవాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. పంచాయతీరాజ్ అధికారాలను రెవెన్యూ శాఖకు బదలాయించడాన్ని తప్పు పట్టారు.

ABOUT THE AUTHOR

...view details