అనంతపురం జిల్లా కణేకల్లు మేజర్ పంచాయతీ గ్రామ నాలుగో సచివాలయం కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న నందిని అనే యువతి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. హిందుపురానికి చెందిన ఆమె ఇటీవల గ్రామ సచివాలయం ఉద్యోగానికి ఎంపికైంది. ఆమె కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సమాచారం. గ్రామ కార్యదర్శి ఉద్యోగం తనకు భారంగా ఉందంటూ తమ వద్ద వాపోయేదని కుటుంబ సభ్యులు తెలిపారు. కొత్త ఉద్యోగంతో పాటు పని ఒత్తిడి వల్ల ఆమె తరచూ ఆందోళనకు గురవుతున్నట్లు తోటి ఉద్యోగులు వెల్లడించారు. పని ఒత్తిడి తట్టుకోలేకపోతున్నట్లు సూసైడ్ నోట్ రాసిపెట్టి బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఒత్తిడి తట్టుకోలేక గ్రామ పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్య - panchayat secretary suicide news updates
అనంతపురం జిల్లా రాయదుర్గంలోని... కణేకల్లు నాలుగో సచివాలయం కార్యదర్శి నందిని ఆత్మహత్యకు పాల్పడింది. పని ఒత్తిడి తట్టుకోలేకపోతున్నట్లు సూసైడ్ నోట్లో పేర్కొంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఒత్తిడి తట్టుకోలేక గ్రామ పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్య