అనంతపురం జిల్లా గుంతకల్లులో.. పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్యకు యత్నించారు. వై.టీ. చెరువు, పాతకొత్త చెరువు గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న రమేష్ నాయక్ (35).. మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించారు.
కుటుంబ సభ్యులు బాధితుడిని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వైద్యులు ప్రథమ చికిత్స చేసిన అనంతరం పరిస్థితి విషమంగా ఉందని గుర్తించి... మెరుగైన వైద్యం కోసం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికు తరలించారు. ఆత్మహత్యాయత్నంపై పోలీసులు విచారణ చేపట్టారు.