ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'తోలుబొమ్మలాట కళాకారులకు దక్కిన అరుదైన గౌరవం' - తెలుగు తేజానికి పద్మ శ్రీ న్యూస్

తనకు పద్మశ్రీ రావడంపై తోలుబొమ్మలాట కళాకారుడు చలపతిరావు ఆనందం వ్యక్తం చేశారు. ఇది తోలుబొమ్మలాట కళాకారులకు దక్కిన గౌరవంగా అభివర్ణించారు. ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లా ధర్మవరం గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది.

padmasree award recipient dhalawai chalapathirao
padmasree award recipient dhalawai chalapathirao

By

Published : Jan 26, 2020, 2:51 PM IST

'తోలుబొమ్మలాట కళాకారులకు దక్కిన అరుదైన గౌరవం'

తనకు పద్మశ్రీ రావడం తోలుబొమ్మలాట కళాకారులకు దక్కిన అరుదైన గౌరవంగా చలపతిరావు అభివర్ణించారు. 60 ఏళ్లుగా తోలుబొమ్మాలాట కళాకారుడిగా ఉంటూ ప్రదర్శనలు చేస్తున్నట్లు వివరించారు. తనకు అవార్డు రావడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో చలిపతిరావు స్వగ్రామమైన ధర్మవరంలో సందడి వాతావరణం నెలకొంది. తమ ఊరి వ్యక్తికి పద్మశ్రీ రావడంపై గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేశారు. చలపతిరావుగతంలో జాతీయ అవార్డుతోపాటు శిల్పగురు అవార్డు పొందారు.

ABOUT THE AUTHOR

...view details