అనంతపురం జిల్లా గుంతకల్లులో ఎమ్మెల్యే వై.వెంకట్రామిరెడ్డి జగనన్న పచ్చతోరణం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ధోని ముక్కల రోడ్డులో పేదలకు పంపిణీ చేసే ఇళ్ల పట్టాల వద్ద రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుకుందాం అని పిలుపునిచ్చారు. కార్యక్రమానికి హాజరైన ప్రజలకు ఎమ్మెల్యే మొక్కలను పంపిణీ చేశారు.
గుంతకల్లులో జగనన్న పచ్చతోరణం - news on pachathoranam at guthakalli
అనంతపురం జిల్లా గుంతకల్లులో ఎమ్మెల్యే వై.వెంకట్రామిరెడ్డి మొక్కలు నాటి జగనన్న పచ్చతోరణం కార్యక్రమాన్ని ప్రారంభించారు. మొక్కలునాటి పర్యావరణాన్ని కాపాడుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.
గుంతకల్లులో జగనన్న పచ్చతోరణం
కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ సీఎం జగన్ ఎన్నో అభివృద్ధి పథకాలను ప్రవేశపెడుతున్నారని ఎమ్మెల్యే అన్నారు. ఆగస్టు 15కు అర్హులైన పేదలందరికీ ఇళ్ల పట్టాలను అందజేస్తామన్నారు. పట్టణంలో రోజు రోజుకీ కరోనా కేసులు పెరిగిపోతుండడం వలన ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలన్నారు. అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి ఎవరు బయటికి రాకూడదని కోరారు.
ఇదీ చదవండి: 'భూములెందుకు అమ్ముతున్నారు.. ఆ హక్కు మీకెక్కడిది..?'