అనంతపురంలో ఆక్సిజన్ ప్లాంట్‌కు ట్యాంకర్ ఆలస్యంగా వచ్చిందని జాయింట్ కలెక్టర్ నిశాంత్ తెలిపారు. మరో ప్లాంట్ నుంచి ప్రైవేట్ ఆస్పత్రులకు ఆక్సిజన్ సరఫరా చేశామని చెప్పారు. ఆగిన ప్లాంట్‌లో మళ్లీ ఉత్పత్తి మొదలైందని జేసీ నిశాంత్ వివరించారు. కోరిన ప్రైవేట్ ఆస్పత్రులకు ఆక్సిజన్ పంపుతున్నామని... ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.
అనంతపురంలోని పలు ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత - Oxygen shortage in Anantapur news
అనంతపురంలోని పలు ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత ఏర్పడింది. ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ అందక రోగులు ఇబ్బందులకు ఇబ్బందులకు గురయ్యారు. ఆస్పత్రులకు ఆక్సిజన్ సరఫరాలో జాప్యంతో రోగులు అవస్థలు పడ్డారు.
Oxygen shortage in many private hospitals in Anantapur