అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో.. మోడల్ పాఠశాలను వంద పడకల ఆసుపత్రిగా మార్చారు. ప్రస్తుతం ఇందులో 40 మందికి పైగా కోవిడ్ బాధితులు ఉన్నారు. అయితే..ఈ కేంద్రంలో వంద పడకలకు కలపి ఒకే ఒక ఆక్సిజన్ సిలిండర్ను ఏర్పాటు చేశారు.
ఫలితంగా.. అవసరానికి ఆక్సిజన్ అందని బాధితులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక్కో బాధితునికి.. 15 నుంచి 30 నిమిషాలు మాత్రమే ఈ ఆక్సిజన్ తీసుకునేందుకు వీలు కల్పిస్తున్నారని బాధితులు వాపోయారు. ఈ విషయంపై ప్రశ్నించిన కోవిడ్ బాధితుల పట్ల.. సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.