ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రభుత్వాసుపత్రికి 25​ ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు అందజేత

అనంతపురం జిల్లా గుంతకల్లు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి వైద్య పరికరాలను యునిసెఫ్ యూనిట్ ఫర్ చిల్డ్రన్ సంస్థ ప్రతినిధులు అందజేశారు. స్థానిక ఎమ్మెల్యే వారికి కృతజ్ఞతలు తెలిపారు.

oxygen concentrators donation
ప్రభుత్వాసుపత్రికి 25​ ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు అందజేత

By

Published : Jul 11, 2021, 7:36 PM IST

అనంతపురం జిల్లాలోని గుంతకల్లు ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రికి 'యూనిసెఫ్ యూనిట్ ఫర్ చిల్డ్రన్' అనే సంస్థ వైద్యపరికరాలను అందించింది. గుంతకల్లు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రూ. 50 లక్షలు విలువ చేసే 25 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, రెండు వేల N- 95 మాస్కూలను సంస్థ ప్రతినిధులు ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి చేతుల మీదుగా ఏరియా ఆసుపత్రి సూపరిండెంట్ హరి ప్రసాద్​కు అందజేశారు.

తమ విజ్ఞప్తి మేరకు యునిసెఫ్​ గ్రేస్​ (Unicef Grace) క్యాన్సర్ ఫౌండేషన్ అండ్ గ్రేస్ గ్లోబల్ హెల్త్ యూఎస్​ఏ (USA) వారు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఇంత పెద్ద స్థాయిలో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి వైద్య పరికరాలు అందించారంటూ.. ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి సంస్థ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details