ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వాహనం ఢీకొని పండ్లు అమ్ముతున్న బాలుడు మృతి - బొమ్మనహల్​ మండలం తాజా ప్రమాదం వార్తలు

రాయదుర్గం నియోజకవర్గం బొమ్మనహల్​ మండలం ఎల్బీనగర్​లో జరిగిన రోడ్డు ప్రమాదంలో బాలుడు దుర్మరణం చెందాడు. కళ్యాణదుర్గం- బళ్లారి ఆర్​ అండ్​ బీ ప్రధాన రహదారి పక్కన చిరు వ్యాపారం చేసుకుంటున్నాడు. వేగంగా వచ్చిన వాహనం ఢీ కొట్టడం వల్ల అక్కడికక్కడే మృతి చెందాడు.

overspeed vehicle hits a fruit seller boy
వాహనం ఢీకొని బాలుడు మృతి

By

Published : Sep 24, 2020, 6:16 PM IST

బళ్లారి వైపు నుంచి గుండ్లపల్లికి వేగంగా వస్తున్న వాహనం బొమ్మనహల్​ మండలం ఎల్బీ నగర్​ గ్రామం వద్ద పండ్ల వ్యాపారం చేసుకుంటున్న బాలుడిని ఢీకొట్టింది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. మరణించిన వ్యక్తి దస్తగిరి (17)గా పోలీసులు గుర్తించారు. బాలుడు పండ్ల వ్యాపారం చేసుకుంటూ తల్లిదండ్రులకు ఆసరాగా ఉండేవాడని స్థానికులు పేర్కొన్నారు. కళ్లెదుటే కుమారుడు మృతి చెందడం వల్ల తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ దుర్ఘటనతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఘటనపై బొమ్మనహల్​ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details