అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని డి.హిరేహాల్, బొమ్మనహాళ్ మండలాల్లో రాత్రి కురిసిన వర్షానికి, భారీ ఈదురు గాలులకు ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. డి.హిరేహాల్ మండలంలోని సోమాలపురం, కుడ్లూరు, బాదనహాల్, బొమ్మనహల్ మండలం లోని పలు గ్రామాల్లో మామిడి, అరటి, దానిమ్మ పంటలకు తీవ్ర నష్టం వాటిల్లినట్లు రైతులు తెలిపారు.
గాలివాన బీభత్సం... దెబ్బతిన్న ఉద్యాన పంటలు - corona news in anantapur dst
గాలివాన బీభత్సనాకి అనంతపురం జిల్లా రాయదుర్గంలోని ఉద్యాన పంటలు నాశనం అయ్యాయి. చేతికొచ్చిన పంట ఎందుకూ పనికిరాకుండా పోయేసరికి అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. అరటి, దానిమ్మ, మామిడి పలు రకాల పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది.
organice forms get loses due to heavy rain anantapr dst
గాలివాన బీభత్సవానికి విద్యుత్ స్తంభాలు, నియంత్రికలు నేలకూలాయి. రెండు మండలాల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చేతికొచ్చిన మామిడి, అరటి పంటలు గాలివానకు దెబ్బతిని నేల రాలడంతో వేలాది రూపాయలు నష్టపోయినట్లు రైతులు చెబుతున్నారు. భారీగా వీచిన గాలులకు మామిడి చెట్లు వేర్లతో సహా నేలకూలాయి. తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
ఇదీ చూడండిఆ పెళ్లికి పోలీసులే కన్యాదాతలు!