అనంతపురం జిల్లా కదిరిలో 'అటవీ కృషితో సిరిధాన్యాల సేద్యం' అనే అంశంపై.. చిరుధాన్యాల సాగు నిపుణులు ఖాదర్ వలీ ఆధ్వర్యంలో.. రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. రసాయనఎరువులు, పురుగు మందులు విచ్ఛలవిడిగా వినియోగించటం వలన పంటలకు నష్టం వాటిల్లడమే కాక ప్రకృతి సమతుల్యం దెబ్బ తింటోందని ఖాదర్ వలీ తెలిపారు. రసాయనాల వాడకం వల్లే అతివృష్టి అనావృష్టి సంభవిస్తున్నాయన్నారు. అధిక దిగుబడి సాధించాలన్న ఆశతో వాణిజ్య పంటల వైపు మొగ్గు చూపడం వలన రైతులు నష్టపోతున్నారని అభిప్రాయపడ్డారు. సిరిధాన్యాల సాగు వల్ల రైతులు తక్కువ పెట్టుబడితో ఎక్కువ పంటలు సాగు చేస్తే లాభసాటిగా ఉంటుందని తెలిపారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి రసాయనాలు లేని మంచి ఆహారం తీసుకోవటమం మేలని సూచించారు.
''రసాయనాలు లేని సిరిధాన్యాల సాగే ఉత్తమం'' - 'అటవీ కృషితో సిరిధాన్యాల సేద్యం'
'అటవీ కృషితో సిరిధాన్యాల సేద్యం' అంశంపై అనంతపురంలో అవగాహన సదస్సు నిర్వహించారు. రసాయనాలు లేని సిరిధాన్యాల సాగు రైతుకు లాభసాటిగా ఉంటుందని నిపుణులు చెప్పారు.
'రసాయనాలు లేని సిరిధాన్యాల సాగే ఉత్తమం'