ఇంటికి అవసరమైన ఇన్వర్టర్ ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన వ్యక్తికి.. పార్సిల్లో బండరాయి రావడంతో అవాక్కయ్యాడు. అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన చేనేత వ్యాపారి ఆదినారాయణ నాలుగు రోజుల క్రితం అమెజాన్ ద్వారా ఇన్వర్టర్ కొనుగోలు చేశాడు. డెలివరీ వచ్చాక తెరిచి చూడగా... అందులో 5 కిలోల బరువు ఉన్న బండరాయి కనిపించింది. అమెజాన్ ప్రతినిధులకు ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయగా... మోసం ఎక్కడ జరిగిందో తెలుసుకుంటామని వారు బదులిచ్చారు. నగదును బ్యాంకు ఖాతాలో జమ చేస్తామన్నారు.
online Cheating: ఆన్‌లైన్‌లో ఇన్వర్టర్ ఆర్డర్ చేస్తే.. బండరాయి వచ్చింది! - అనంతపురం జిల్లా వార్తలు
గుదిబండగా మారిన విద్యుత్ కోతల నుంచి తప్పించుకునేందుకు ఓ వ్యక్తి.. ఇన్వర్టర్ను ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేస్తే.. అక్కడ మరో బండరాయి ఇంటికొచ్చింది. ఈ ఘటన అనంతపురం జిల్లాలోని ధర్మవరంలో జరిగింది.
online Cheating