వీధి బాలలు, అనాథ పిల్లలను సంరక్షణ కేంద్రాలకు తరలించడమే లక్ష్యంగా అనంతపురం జిల్లాలో ఆపరేషన్ ముష్కన్ వాహనాన్ని ఏర్పాటు చేశారు. వీటిని జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబు జెండా ఊపి ప్రారంభించారు. ఆపరేషన్ ముస్కాన్లో భాగంగా పోలీసులు పలు విభాగాలతో సంయుక్తంగా చేసేందుకు ఈ కార్యక్రమం చేపట్టారు.
కొవిడ్ నేపథ్యంలో ఈ టీంలో పాల్గొనే సభ్యులు మాస్కులు, శానిటైజర్లు ధరించడమే కాకుండా పిల్లలకు కూడా అందించే ఏర్పాటు చేశారు. ఈ టీం సభ్యులు తీసుకొచ్చిన పిల్లలకు ముందుగా కరోనా పరీక్షలు నిర్వహిస్తామన్నారు. అనంతరం వీరి వివరాలను నేషనల్ వైడ్ ట్రాక్ ది చిల్డ్రన్ పోర్టల్లో చేరుస్తామని చెప్పారు. ఎక్కడైనా తప్పిపోయిన పిల్లలు ఉంటే వారి తల్లిదండ్రుల వద్దకు చేరుస్తామని తెలియజేశారు.