అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని కనేకల్ మండలంలో ఎస్సై దిలీప్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాన్ని విజయవంతంగా చేపట్టారు. మండల కేంద్రంతో పాటు ఎర్రగుంట, మాల్యం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి 10 మంది బాల కార్మికులకు విముక్తి కలిగించారు. చిన్న పిల్లలతో పనులు చేయిస్తున్న వారి తల్లిదండ్రులను హెచ్చరించారు. పిల్లలను బడికి పంపి విద్యాబుద్దులు నేర్పించాలని సూచించారు.
ఆపరేషన్ ముస్కాన్.. 10 మందికి విముక్తి - కనెకల్ తాజా వార్తలు
ఆపరేషన్ ముస్కాన్లో భాగంగా అనంతపురం జిల్లా కనేకల్ మండల పోలీసులు బాల కార్మికులను గుర్తించారు. వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. పిల్లలకు మంచి విద్యాబుద్ధులు నేర్పేందుకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.
kanekal police station