ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆ ఊరికి 45 ఏళ్లు ఓకే ఒక సర్పంచ్​ - అనంతపురంలో 45ఏళ్లుగా ఓకే సర్పంచ్ వార్తలు

ఆ ఊరిలో నాలుగు దశాబ్దాలుగా పంచాయతీ ఎన్నికల ఊసేలేదు. స్థానకులు ఎన్నడూ ఓటేసి ఎరుగరు. అలాగని ఆ ఊరు రికార్డుల్లో లేనిదో.. లేదంటే ప్రజలు నిరక్ష్యరాసులో అనుకుంటే పొరబడినట్లే. 45ఏళ్లుగా ఆ ఊరికి ఓకే సర్పంచ్​ ఉండటంతో వారికి ఓటెయ్యాల్సిన అవసరం ఏర్పడలేదు. అన్ని సంవత్సరాలు సర్పంచ్​గా సేవలందించి చిన్న గూడు కూడా లేని ఆయన.. అనంతపురం జిల్లా కల్యంకు గ్రామానికి చెందిన మురికాలయ్య గురించి మనమూ తెలుసుకుందాం.

only one sarpanch have been elected as sanparch for 45 years at ananthapur district
ఆ ఊరికి 45 ఏళ్లు ఓకే ఒక సర్పంచ్​

By

Published : Jan 31, 2021, 11:32 AM IST

అనంతపురం జిల్లా డి.హీరేహాళ్‌ మండలం హులికల్లు గ్రామ పంచాయతీ పరిధిలోని కల్యంకు గ్రామంలో.. నాలుగు దశాబ్దాలుగా పంచాయతీ ఎన్నికల ఊసేలేదు. ఎన్నడూ ఓటేసి ఎరుగరు. అలాగని ఫ్యాక్షన్‌ గ్రామం కాదు.. ఎన్నికలను బహిష్కరించనూ లేదు.. ఆ ఊరికి చెందిన మురికాలయ్య అంటే ప్రేమతో కూడిన అభిమానం. ఆయనను ఏకగ్రీవంగా సర్పంచిగా ఎన్నుకుంటూ వచ్చారు. చుట్టు పక్కల గ్రామాల్లోనూ ఆదరణ పొందారు. ఎలాంటి సమస్య ఎదురైనా పరిష్కారానికి నాయకులు ఆశ్రయించేవారు. ఆయన సర్పంచిగా ఉన్నన్ని రోజులు ఆ గ్రామ ప్రజలు పోలీసుస్టేషన్‌ ఎరుగరంటే అతిశయోక్తి కాదు. ఏ కార్యక్రమం నిర్వహించాలన్నా ప్రజలందరూ సంఘటితంగా నిర్ణయాలు తీసుకునేవారు. ఆయన నిస్వార్థంగా పనిచేసి 16 ఎకరాల పొలాన్ని పోగొట్టుకున్నారు. ఆరుగురు కుమారులున్నా పక్కా గృహాలు కూడా వారు నోచుకోలేదు.

ప్రగతి పథం..

మురికాలయ్య గ్రామంలో ఫ్రాథమికోన్నత పాఠశాల, పంచాయతీ కార్యాలయం, ఆలయాల నిర్మాణానికి కృషి చేశారు. పేదలకు పక్కా గృహాల మంజూరుకు చర్యలు తీసుకున్నారు. ఆయన తర్వాత తెదేపా మద్దతుదారు పరమేశ్వరప్పను ఏకగ్రీవంగా గ్రామస్థులు ఎన్నుకున్నారు.

అందరివాడిగా గుర్తింపు

డి.హీరేహాళ్‌ మండలం హులికల్లు గ్రామ పంచాయతీ పరిధిలోని కల్యంకు చెందిన మురికాలయ్య 45 ఏళ్లపాటు సర్పంచ్​గా కొనసాగారు. తిరుగులేని నాయకుడిగా చరిత్ర సృష్టించారు. ఆ గ్రామ పంచాయతీ ఏర్పడినప్పటి నుంచి తొమ్మిదిసార్లు ఏకగ్రీవంగా ఎన్నికై సర్పంచ్​గా కొనసాగారు. 1956 నుంచి 2001 వరకు సర్పంచ్​గా పనిచేశారు. బోయ సామాజిక వర్గానికి చెందిన మురికాలయ్య.. అందరివాడిగా గుర్తింపు పొందారు. ఆ తర్వాత ఆయన తమ్ముడి కుమారులు మూడుసార్లు పోటీ చేసి విజయం సాధించారంటే.. ఆ కుటుంబంపై గ్రామస్థులకు ఎంత ప్రేమాభిమానమో అర్థం చేసుకోవచ్చు. ఆయన మరణించి 20 ఏళ్లయినా.. నేటికీ ప్రజలు గుర్తు చేసుకుంటూనే ఉంటారు. మాజీ ఎమ్మెల్యే పాటిల్‌ వేణుగోపాల్‌రెడ్డికి ప్రధాన మద్దతుదారుడిగా ఉంటూ వచ్చారు. శాసనసభ, పార్లమెంట్‌ ఎన్నికల్లోనూ ఆయన చెప్పిన వారికే ఓట్లు వేసేవారు.

ఇదీ చదవండి:

పంచాయతీ పోరు: వైకాపా, తెదేపాకు రెబల్స్‌ బెడద.. ఇరు పార్టీల్లో బుజ్జగింపుల పర్వం

ABOUT THE AUTHOR

...view details