ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కౌన్​బనేగా కరోడ్​పతి అంటూ రూ.66 వేలు దోచేశారు! - latest news in ns gate

రూ. 25 లక్షలు మీ ఖాతాలో జమ అయ్యాయని ఫోన్ రాగానే ఆ వ్యక్తి ఉప్పొంగిపోయాడు. ఉన్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయని సంబరపడ్డాడు. వెంటనే మరో ఖాతాలోకి 66 వేల నగదు జమ చేస్తే మెుత్తం నగదు మీ సొంతమే అన్న మాటలు గుడ్డిగా నమ్మి మోసపోయాడు.

ఆన్​లైన్ మోసం

By

Published : Nov 16, 2019, 6:47 AM IST

ఆన్​లైన్ మోసం
కౌన్‌బనేగా కరోడ్​పతి పేరుతో ఓ వ్యక్తి నుంచి రూ.66 వేలను సైబర్​ మోసగాళ్లు దోచేసిన సంఘటన.. అనంతపురం జిల్లా చెన్నెకొత్తపల్లి మండలం ఎన్​ఎస్​గేట్‌లో జరిగింది. గ్రామానికి చెందిన వన్నూరు అలీ మొబైల్​ఫోన్​కు... ఓ కాల్‌ వచ్చింది. కౌన్​బనేగా కరోడ్​పతి కార్యక్రమం ద్వారా మీరు 25 లక్షలు గెలుచుకున్నారని అజ్ఞాతవ్యక్తి ఆలీకి చెప్పాడు. మీ ఫోన్‌నంబర్‌ మీద 25 లక్షలు మీ ఖాతాలో జమయ్యాయని నమ్మబలికాడు. ఆ సొమ్మును తీసుకునేందుకు తక్షణమే 66వేలు వేయాలంటూ వేరే ఖాతా నంబర్‌ ఇచ్చాడు. ఇదంతా నిజమేనని నమ్మిన అలీ... సదరు ఖాతాలో 66వేలను రెండు విడతల్లో డిపాజిట్‌ చేశాడు. ఇక 25లక్షలు వచ్చేశాయనుకుంటున్న అలీకి... మరో 60వేలు ఖాతాలో వేయాలంటూ అజ్ఞాతవ్యక్తి నుంచి మళ్లీ ఫోన్‌ వచ్చింది. అనుమానం వచ్చిన అతను పోలీసులకు ఫిర్యాదు చేయగా... సొమ్ము జమచేసిన నంబర్లు వేర్వేరుగా ఉన్నాయని తేల్చారు. డబ్బులు వస్తాయన్న నమ్మకంతో పది రూపాయల వడ్డీకు పెద్ద మెుత్తంలో డబ్బు తెచ్చి నిండా మునిగిపోయానంటూ బాధితుడు బోరున విలపిస్తున్నాడు. డబ్బు జమ అయ్యిందంటూ వచ్చే ఫోన్లను నమ్మెుద్దంటూ బాధితుడు కోరుతున్నాడు.

ABOUT THE AUTHOR

...view details