ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉల్లికి కరోనా కాటు.. దిక్కుతోచని స్థితిలో రైతు - onion farmers problems in ananthapuram

వ్యవసాయానికి అనుకూలించని వాతావరణం, ఏడాది పొడవునా వాన చినుకు కోసం ఆకాశం వంక చూసే రైతులే అక్కడ ఎక్కువగా కనిపిస్తుంటారు. అందుబాటులో ఉన్న కొద్దిపాటి జలాలతో ఉద్యాన పంటలు సాగు చేసినా ప్రస్తుతం లాక్​డౌన్​ వల్ల పంట అమ్ముకోలేక కర్షకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లాభాలతో తమ కన్నీటిని తుడుస్తుందనుకున్న ఉల్లి చివరకు తమకు కన్నీటినే మిగులుస్తుందని వాపోతున్నారు. కరవు సీమ అనంతలో ఉల్లి రైతుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు.

ఉల్లికి కరోనా కాటు.. దిక్కుతోచని స్థితిలో రైతు
ఉల్లికి కరోనా కాటు.. దిక్కుతోచని స్థితిలో రైతు

By

Published : Apr 28, 2020, 7:42 PM IST

అనంతపురం జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం 2,200 హెక్టార్లలో రైతులు ఉల్లి సాగు చేశారు. కర్ణాటక సరిహద్దులోని బొమ్మనహాల్, రాప్తాడు, కళ్యాణదుర్గం, రాయదుర్గం తదితర మండలాల్లో పంట ఎక్కువగా సాగయ్యింది. దిగుబడి బాగా వచ్చినా.. లాక్​డౌన్​ వల్ల ఉల్లిని కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ఎవరూ ముందుకు రావడం లేదు. వినియోగదారులకు విక్రయించే ధర కిలో 25 నుంచి 30 రూపాయలు ఉండగా.. తమ నుంచి 8 రూపాయలకు కూడా కొనడం లేదని ఉల్లి రైతులు వాపోతున్నారు. పంటను అమ్ముకునే అవకాశం లేక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నామని కర్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తాత్కాలిక మార్కెట్లు ఏర్పాటు చేస్తే మేలే

వినియోగదారుల నుంచి ఉల్లికి పెద్దఎత్తున డిమాండ్ ఉంది. లాక్​డౌన్​ సందర్భంగా అధికారులు పలుచోట్ల ఏర్పాటు చేసిన తాత్కాలిక మార్కెట్లలో ఉల్లిని అధికంగా కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు చొరవ తీసుకొని జిల్లాలోని ఉల్లినంతా ప్రధాన పట్టణాలకు తీసుకొచ్చేలా అవకాశం కల్పిస్తే రైతులకు, వినియోగదారులకు మేలు జరుగుతుంది.

ఇదీ చూడండి..

ఈటీవీ చొరవ...తొలగిన మహిళల ఇబ్బందులు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details