ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Dharmavaram: ధర్మవరం డివిజన్‌ రద్దును వ్యతిరేకిస్తూ పరిటాల శ్రీరామ్‌ నిరాహార దీక్ష - అనంతపురం జిల్లా వార్తలు

New Districts In AP: కొత్త జిల్లాల ఏర్పాటుపై రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఆందోళనలు, నిరసనలు రోజురోజుకు ఉద్ధృతమవుతున్నాయి. ధర్మవరం రెవెన్యూ డివిజన్‌ను రద్దు చేయడాన్ని నిరసిస్తూ తెదేపా నేత పరిటాల శ్రీరామ్‌ నిరాహారదీక్ష చేపట్టారు. ఎన్టీఆర్‌ కూడలి నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు భారీ ప్రదర్శన చేపట్టారు.

Tdp protest on formation of new districts
Tdp protest on formation of new districts

By

Published : Feb 7, 2022, 12:47 PM IST

New Districts In AP: కొత్త జిల్లాల ఏర్పాటుపై రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఆందోళనలు, నిరసనలు రోజురోజుకు ఉద్ధృతమవుతున్నాయి.. కొన్నిచోట్ల జిల్లా కేంద్రాలుగా తమ ప్రాంతాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తుండగా.. మరికొన్నిచోట్ల జిల్లా పేర్లపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ధర్మవరం రెవెన్యూ డివిజన్‌ను రద్దుచేయడాన్ని నిరసిస్తూ తెదేపా నేత పరిటాల శ్రీరామ్‌ నిరాహారదీక్ష చేపట్టారు. ఎన్టీఆర్‌ కూడలి నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. రాప్తాడు నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల ప్రజలు మద్దతు తెలుపుతూ ర్యాలీలో పాల్గొన్నారు. రెవెన్యూ డివిజన్ కొనసాగించాలని నినాదాలు చేశారు

నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గృహనిర్బంధం...

తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం రామవరంలో తెదేపా సీనియర్‌ నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని గృహనిర్బంధించారు. పెదపూడి మండలాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని డిమాండ్‌ చేస్తూ... పెదపూడి నుంచి ర్యాలీగా కాకినాడ కలెక్టరేట్‌కు వెళ్లాలని పిలుపునివ్వడంతో రామకృష్ణారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

రంపచోడవరం జిల్లాగా చేయాలంటూ డిమాండ్...

తూర్పుగోదావరి జిల్లాలోని రంపచోడవరం ప్రాంతాన్ని జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష నాయకులు బంద్​కు పిలుపునిచ్చారు. మన్యంలోని 11 మండలాల్లో అఖిలపక్షం ఆధ్వర్యంలో బంద్ చేపట్టారు. నెల్లిపాక వద్ద జాతీయ రహదారిపై అఖిలపక్ష నాయకుల మానవహారం నిర్వహించారు. ఎటపాక డివిజన్ యథావిధిగా కొనసాగించాలని కోరారు. చింతూరు ఐటీడీఏ కొనసాగించాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:New Districts In AP: రాష్ట్రంలో కొత్త జిల్లాల కుంపటి.. కొనసాగుతున్న ఆందోళనలు

ABOUT THE AUTHOR

...view details