అనంతపురం జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెన్నహోబిలంలో.. శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి రథం నిర్మాణానికి చేపట్టిన విరాళాల సేకరణ కొనసాగుతోంది. ఆలయ ఈవో ప్రారంభించిన సేకరణకు.. ఒక్క శుక్రవారం రోజునే దాతల నుంచి 75 వేల 236 రూపాయల మేర చందాలు అందాయి.
వీటితో కలిపి.. ఇప్పటి వరకు భక్తుల నుంచి వచ్చిన విరాళాల మెుత్తం 46 లక్షల 39 వేల 610 రూపాయలకు చేరినట్లు ఆలయ ఈవో రమేశ్ బాబు తెలిపారు. రథం నిర్మాణం కోసం రూ.1.5 కోట్లతో అంచనాలు సిద్ధం చేసినట్లు ఆయన పేర్కొన్నారు.