ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కార్మికుల మధ్య ఘర్షణ... ఒకరు మృతి - హిందూపురం తాజా నేర వార్త

కార్మికుల మధ్య ఘర్షణ ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

person was killed in a clash between workers
కార్మికుల మధ్య ఘర్షణ

By

Published : Dec 3, 2020, 1:37 PM IST

అనంతపురం జిల్లా హిందూపురం మండలం పారిశ్రామికవాడలో... కార్మికుల మధ్య ఘర్షణ తలెత్తింది. దాడిలో ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ పరిశ్రమలో పనిచేసే కార్మికుల మధ్య ఘర్షణ తారాస్థాయికి చేరింది. ఈ క్రమంలో ఒడిశాకు చెందిన రత్నాకర్ జిన్నా అనే వ్యక్తిని... రాజేష్ జిన్నా అనే మరో వ్యక్తి కత్తితో పొడిచాడు.

ఈ ఘటనలో.. రత్నాకర్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుడు రాజేష్ తిన్నాను అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details