అనంతపురం జిల్లా విడపనకల్ మండలం పొలికి గ్రామానికి చెందిన లోకేశ్(23) తన తండ్రి ఆవేదన చూడలేక ఆత్మహత్య చేసుకున్నాడు. వ్యవసాయంతో పాటు తన అన్న పెళ్లికి తండ్రి చేసిన అప్పులు తీరకపోవడం కారణంగా తండ్రి పడుతున్న ఆవేదన చూడలేక యువకుడు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
తండ్రి ఆవేదన చూడలేక కుమారుడు ఆత్మహత్య - అనంతపురం తాజా వార్తలు
తండ్రి ఆవేదన చూడలేక కుమారుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన అనంతపురం జిల్లా పొలికి గ్రామంలో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
![తండ్రి ఆవేదన చూడలేక కుమారుడు ఆత్మహత్య తండ్రి ఆవేదన చూడలేక కుమారుడు ఆత్మహత్య](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8787375-464-8787375-1599997775894.jpg)
తండ్రి ఆవేదన చూడలేక కుమారుడు ఆత్మహత్య
గ్రామానికి చెందిన సుంకన్న అనే రైతు వ్యవసాయంతో కుటుంబాన్ని పోషిస్తుండగా వరుస నష్టాలు వచ్చాయి.. దీనికితోడు ఇటీవల పెద్ద కొడుకు పెళ్లి చేశాడు. దీంతో అప్పుల భారం మరింత పెరిగింది. అప్పు తీరే మార్గం లేక తండ్రి పడుతున్న బాధను చూడలేక అతని రెండో కుమారుడు లోకేష్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకున్నాడు. కుటుంబ సభ్యులు గమనించేలోపు యువకుడు మృతి చెందాడు. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ గోపి తెలిపారు.
ఇదీ చదవండి
భారీ పెట్రోలియం ప్రాజెక్టులు ప్రారంభించిన మోదీ
Last Updated : Sep 14, 2020, 8:20 AM IST
TAGGED:
అనంతపురం తాజా వార్తలు