అనంతపురం జిల్లా నల్లచెరువు మండలం ఇందుకూరు పల్లిలో వెంకటరమణ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. శుక్రవారం ఇంటి నుంచి వెళ్లిన వెంకటరమణ తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆయన ఆచూకి కోసం గాలించారు. గ్రామానికి సమీపంలోని మామిడితోటలో వెంకటరమణ మృతదేహాన్ని గుర్తించిన పశువుల కాపరులు కుటుంబ సభ్యులకు తెలియజేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతుడి శరీరంపై ఉన్న గాయాలను పరిశీలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు ఆధారంగా నల్లచెరువు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కదిరికి తరలించారు
జిల్లాలో వ్యక్తి దారుణ హత్య - suspected death in anantaur dst
అనంతపురం జిల్లాలో ఓ వ్యక్తి హత్య కలకలం రేపుతోంది.ఇంటి నుంచి వెళ్లిన వ్యక్తి శవమై కనిపించటంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.
జిల్లాలో వ్యక్తి దారుణ హత్య