కారు బోల్తా పడి వ్యక్తి మృతి - అనంతపురం జిల్లా నేర వార్తలు
కారు బోల్తా పడి వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందడంతో పాటు మరోవ్యక్తి తీవ్రంగా గాయపడిన ఘటన అనంతపురం జిల్లా చీకటిమానుపల్లి సమీపంలో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అనంతపురం జిల్లా తనకల్లు మండలం చీకటి మానుపల్లి సమీపంలో 42వ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈఘటనలో ఒకరు మృతి చెందగా...మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. తనకల్లు మండలం ఎర్రగుంటపల్లికి చెందిన రవీంద్ర తన మిత్రుడు రవితో కలిసి చిత్తూరు జిల్లా ములకలచెరువుకు కారులో బయల్దేరారు. చీకటిమాన్పల్లి సమీపంలో కారు ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో రవీంద్ర అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన రవిని చికిత్స కోసం కదిరి ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు.