అనంతపురం జిల్లా(anantapur district) కళ్యాణదుర్గం మండలం హులికళ్లు గేట్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం(road accident) జరిగింది. వేగంగా వస్తున కారు అదుపుతప్పి కల్వర్టును ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న తిమ్మారెడ్డి(65) మృతి చెందగా.. అతని అల్లుడు హరికృష్ణకు తీవ్రగాయాలయ్యాయి. అప్రమత్తమైన స్థానికులు వీరిని ఆసుపత్రికి తరలించారు.
Accident: అనంతలో రోడ్డు ప్రమాదం.. మామ మృతి, అల్లుడికి తీవ్రగాయాలు
అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం(road accident) జరిగింది. కారు అదుపుతప్పి కల్వర్టును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. బాధితులు కర్ణాటక రాష్ట్రానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.
బాధితులు కర్ణాటక రాష్ట్రం(karnataka)లోని బళ్లారి పట్టణంలోని కాకార్ల తోటకు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. వీరు పావగడలో దేవుని దర్శనం చేసుకుని తిరుగుప్రయాణంలో కళ్యాణదుర్గం మీదుగా బళ్లారి వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. నిద్రమత్తులో కారు నడపటం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. తిమ్మారెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కళ్యాణదుర్గం ప్రభుతాసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి