ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రెండు ఆటోలు ఢీ.. ఒకరు మృతి, నలుగురికి గాయాలు - పోతుకుంట రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను.. పాలక్యాన్లతో వస్తున్న మరో ఆటో ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు మరణించారు. అనంతపురం జిల్లా ధర్మవరం మండలం పోతుకుంట వద్ద జరిగిన ఈ ప్రమాదంలో.. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను ధర్మవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

two autos hit each other at pothukunta
రెండు ఆటోలు ఢీకొని ఒకరు మృతి

By

Published : Mar 12, 2021, 3:50 PM IST

అనంతపురం జిల్లా ధర్మవరం మండలం పోతుకుంట వద్ద రెండు ఆటోలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. డ్రైవర్ పక్కనే కూర్చున్న సీతారాంపల్లికి చెందిన నాగిరెడ్డి (72) అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రయాణికులతో ధర్మవరం నుంచి మామిళ్లపల్లి వెళ్తున్న ఆటోను.. పాల క్యాన్లతో వస్తున్న మరో ఆటో ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ధర్మవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details