అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో దారుణం జరిగింది. పట్టణంలోని పార్వతీనగర్కు చెందిన నాగరాజు అనే వ్యక్తి.. తన ఇరుగు పొరుగు వారు గొడవ పడుతుంటే వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేశాడు. ఇంతలో గొడవ పడుతున్న వారిలో ఓ వ్యక్తి.. తమ ఇద్దరి మధ్య తల దూర్చడానికి నీవెవరంటూ నిలదీశాడు. ఇంట్లో కుళాయికి సంబంధించిన పైపు తీసుకువచ్చి నాగరాజును చితకబాదాడు. తీవ్ర గాయాలపాలైన నాగరాజు... రక్త స్రావంతో కల్యాణదుర్గం పట్టణ పోలీస్ స్టేషన్కు రాగానే అక్కడ ఉన్న పోలీస్ సిబ్బంది అతన్ని సమీప ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
తగువు నడుమ తల దూరిస్తే.. తల పగిలింది! - అనంతపురంలో మనుష్యుల వివాదాల వార్తలు
రెండు ఇళ్ల వారు తగువు పడుతుంటే.. సర్ది చెబుదామని తలదూర్చిన ఓ వ్యక్తి... చివరకు తన తలే పగలగొట్టించుకున్నాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా కల్యాణదుర్గం పట్టణంలో జరిగింది.
![తగువు నడుమ తల దూరిస్తే.. తల పగిలింది! man injured in conflict issue at kalyandurgam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7509677-666-7509677-1591478680395.jpg)
ఇద్దరి మధ్యకు వెళ్లి తీవ్ర గాయాలపాలైన వ్యక్తి