అనంతపురం జిల్లా కూడేరు మండలంలో తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. బ్రాహ్మణపల్లి వద్ద జాతీయ రహదారిపై బ్రేక్ ఫెయిల్ కావడంతో డ్రైవర్ లారీని రోడ్డుకు అడ్డంగా నిలిపివేశాడు. ఇదే మార్గంలో వేగంగా వచ్చిన కారు రోడ్డుకు అడ్డంగా ఆపేసిన లారీని బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయ్యింది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రుల్ని అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ACCIDENT : ఆగిఉన్న లారీని ఢీ కొట్టిన కారు...ఒకరు మృతి - anantapur district
అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగిఉన్న లారీని కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
ఆగిఉన్న లారీని ఢీ కొట్టిన కారు