అనంతపురం జిల్లా కదిరి మండలం మల్లయ్యగారిపల్లిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో, ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందారు. కదిరికి చెందిన మస్తాన్ వలీ.. మల్లయ్యగారిపల్లిలో ఉన్న మామిడి తోటకు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ఎదురుగా వచ్చిన ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మస్తాన్ వలీ తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స కోసం క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కదిరి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని.. శవపరీక్ష నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఆటో-ద్విచక్రవాహనం ఢీ: ఒకరు మృతి - అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం
అనంతపురం జిల్లా మల్లయ్యగారిపల్లిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో-ద్విచక్రవాహనం ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. శవపరీక్ష నిమిత్తం మృతదేహాన్ని కదిరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మస్తాన్వలీ