అనంతపురం జిల్లా విడపనకల్లు మండల ఉండబండ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గణేశ్ అనే వ్యక్తి మృతి చెందాడు. మృతుని భార్య పద్మశ్రీ.. పాల్తూరు సచివాలయం-2లో పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో గణేశ్.. తన భార్యను కలవడానికి ద్విచక్ర వాహనంపై పాల్తూరుకు వెళ్తుండగా ఉండబండ గ్రామ సమీపంలో ప్రమాదవశాత్తు అదుపుతప్పి కింద పడ్డాడు. తలకు బలమైన గాయం కావడంతో అక్కడికిఅక్కడే మృతి చెందాడు. మృతుడికి సంవత్సరం వయసున్న బాలుడు ఉన్నాడు. విషయం తెలుసుకున్న భార్య కన్నీరుమున్నీరుగా విలపించింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం - అనంతపురం జిల్లా వార్తలు
భార్యా, పిల్లలతో సంతోషంగా జీవిస్తున్న ఆ కుటుంబాన్ని విధి వెక్కిరించింది. రోడ్డు ప్రమాద రూపంలో మృత్యువు ఆ ఇంటి పెద్దను తీసుకెళ్లిపోయింది. ఆ కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చింది. ఈ హృదయ విదారక ఘటన అనంతపురం జిల్లా ఉండబండలో జరిగింది.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణంరోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం